కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించటానికి కేంద్రం విముఖత

కర్నాటక గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్‌కు వ్యతిరేకంగా తన ప్రచారోద్యమాన్ని బిజెపి మంగళవారం ఉధృతం చేసింది. రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధించాలన్న భరద్వాజ్ సిఫార్సును తిరస్కరించాలని, ఆయనను తక్షణమే రీకాల్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ బిజెపి మంగళవారం ఆ రాష్ట్రంలోని తన ఎంఎల్‌ఎలను రాష్టప్రతి ముందు పెరేడ్ చేయించింది. అయితే, చెక్కు చెదరని భరద్వాజ్ ఎదురుదాడి చేస్తూ స్పీకర్, ముఖ్యమంత్రి కుమ్మక్కయిన కారణంగా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విచ్ఛిన్నమైందని, వారిద్దరి లాలూచి తిరుగుబాటు ఎంఎల్‌ఎల అనర్హతకు దారి తీసిందని ఆరోపించారు.
బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరి, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌తో సహా ఇతర కేంద్ర నేతల సారథ్యంలో కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప, 114 మంది ఇతర ఎంఎల్‌ఎలు రాష్టప్రతి ముందు హాజరై తమ కోర్కెల పత్రాన్ని అందజేశారు. రాష్టప్రతితో సమావేశం అనంతరం నితిన్ గడ్కరి మీడియాతో మాట్లాడుతూ, 'మేము రాష్టప్రతిని కలుసుకొని మాకు రక్షణ కల్పించాలని కోరాం. రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధించాలని సిఫార్సు చేసిన గవర్నర్ నివేదికపై ఎటువంటి చర్యా తీసుకోరాదని మేము ఆమెకు విజ్ఞప్తి చేశాం. రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధించరాదు" అని పేర్కొన్నారు. రాష్టప్రతి రాజ్యాంగసంరక్షకురాలు కనుక ఆమె దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లాలని బిజెపి నిశ్చయించినట్లు ఆయన తెలియజేశారు.












Click it and Unblock the Notifications