జగన్ ఎమ్మెల్యేల పని అంతేనా: రాజ్యాంగ నిపుణులతో చర్చలు

YS Jagan
హైదరాబాద్: తమపై అనర్హత వేటు పడితే ఎందుకు కొర కాకుండా పోతామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులు బయపడుతున్నారు. తమపై డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనర్హత వేటు వేస్తే వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి వీలు కాదని వారు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్లనే ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డి, కాంగ్రెసు శాసనసభ్యురాలు కమలమ్మ వెనక్కి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ సమస్యపై వైయస్ జగన్ ఇద్దరు రాజ్యాంగ నిపుణులతో చర్చలు జరపాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గత కొద్ది నెలలుగా ప్రభుత్వ చీఫ్ విప్ మల్లుభట్టి విక్రమార్క తిరుగుబాటు శాసనసభ్యులతో చర్చలు జరుపుతున్నారు. అనర్హత వేటు పడితే ఉప ఎన్నికల్లోనే కాదు, వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి వీలు కాదని ఆయన వారిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అనర్హత వేటు పడితే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడంపై నిషేధం విధిస్తారని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

ఫిరాయింపుల నిరోధక చట్టంపై పూర్తి వివరణ కోసం వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు రాజ్యాంగ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించే హక్కు ఎన్నికల కమీషన్‌కు లేదా ఎన్నికల ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉంటుందని, అటువంటి హక్కు స్పీకర్‌కు లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతున్నారు. స్పీకర్ అనర్హత వేటు మాత్రమే వేయగలరని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+