గడ్చిరోలీ: మాహారాష్ట్రలోని గడ్చిరోలీలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో 15 మంది మావోయిస్టులు, నలుగురు పోలీసులు మరణించారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని భావిస్తున్నారు. గడ్చిరోలీలోని భామ్రాఘడ్ తాలూకా నార్గొండ గ్రామంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. గురువారం ఉదయం పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. కొన్ని గంటల పాటు ఈ ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ఎదురు కాల్పులు ప్రారంభమైనట్లు సమాచారం. నార్గొండ అటవీ ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు జరిగాయి. ఇటీవలి కాలంలో ఇంత భారీ ఎదురు కాల్పులు జరగడం ఇదే ప్రథమం.