ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ

బార్కాస్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళిన అక్బరుద్ధీన్ ఒవైసీపై గత ఎన్నికల్లో ఎంబీటీకి మద్దతిచ్చిన మహ్మద్ పహిల్వాన్ అతని బావమరిదులు, ఇద్దరు మేనల్లుళ్లు దాడికి పాల్పడ్డారు. భూవివాదంతో జరిగిన దాడిలో అక్భరుద్ధీన్ కడుపు, మూత్రనాళాలు, దవడపై గాయాలు తగిలాయి. కిడ్నీ పాడవడంతో నాలుగు బుల్లెట్లను ఒవైసీ శరీరం నుంచి తొలగించిన కేర్ ఆస్పత్రి వైద్యులు, ఆయనకు డయాలసిస్ చికిత్స అందించారు.
వైద్యులు అందించిన చికిత్సతో పూర్తిగా కోలుకున్న అక్భరుద్ధీన్ శుక్రవారం కేర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి ఘటన సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మరణించారు.












Click it and Unblock the Notifications