హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పదవి రాగానే జానారెడ్డి మౌనం వహించారు: హరీష్ రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతానికి చెందిన జానారెడ్డి తనకు పదవి రాగానే తెలంగాణ అంశంపై మౌనం వహించారని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం ఉందని, అందులో నాలుగు కోట్ల ప్రజలు ఉన్నారనే ఆలోచన అధికార కాంగ్రెసు ప్రభుత్వానికి లేదన్నారు. తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించిన మూడు వందల యాభై కోట్ల రూపాయలలో ఒక్క రూపాయి కూడా తెలంగాణ ప్రాంతానికి కేటాయించలేదన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం ఇంత ఎత్తున జరుగుతున్న సమయంలో కూడా ప్రభుత్వం నిధులు కేటాయించక పోవడంతో ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంతంపై ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు.

తెలంగాణలో తాగునీటి సమస్య లేదా అని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర జెఏసిలో కొందరు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్‌ను బిన్ లాడెన్‌తో పోల్చారని, తెలంగాణకు న్యాయం చేయని ఆంధ్ర ప్రాంత నేతలు బిన్ లాడెన్‌లా, కెసిఆర్ బిన్ లాడెనా చెప్పాలన్నారు. సమైక్యాంధ్ర అంటున్న సిపిఎం రాఘవులు, టిడిపి అధినేత చంద్రబాబుకు, నిత్యం రాజ్యాంగం చంకలో పెట్టుకొనే లోక్ సత్తా అధ్యక్షుడు జయ ప్రకాశ్ నారాయణకు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తెలంగాణ నిధులు ఆంధ్రకు మళ్లిస్తున్నాయన్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా తెలంగాణకు కష్టం, ఆంధ్రకు సుఖంగా ఉన్నదన్నారు.

English summary
TRS MLA Harish Rao blamed congress senior leader Jana Reddy today for Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X