వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా దీదీ మమతా బెనర్జీ ప్రమాణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Mamata Banerjee
కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కళకత్తా కాళిక తృణమూల్ కాంగ్రెసు నేత మమతా బెనర్జీ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత గవర్నర్ ఎంకె నారాయణన్ ప్రమాణం స్వీకారం చేయించారు. పశ్చిమ బెంగాల్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ పదవీబాధ్యతలు చేపట్టబోతున్నారు. 34 ఏళ్ల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో వామపక్షేతర ప్రభుత్వం ఏర్పడింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కూడా హాజరయ్యారు.

కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, ఆంటోనీ, మునియప్ప కూడా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రివర్గంలో తృణమూల్ కాంగ్రెసుకు చెందిన 37 మంది చేరారు. కాంగ్రెసు కూడా మమతా మంత్రివర్గంలో చేరింది. కాంగ్రెసుకు చెందిన ఏడుగురు శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాము మంత్రివర్గంలో చేరుతున్నామని, తమ జాబితాను మమతాకు ఇచ్చామని అంతకు ముందు కేంద్ర మంత్రి ఆంటోనీ మీడియా ప్రతినిధులతో చెప్పారు.

English summary
Trinamool Congress chief Mamata Banerjee was on Friday sworn-in as the first woman Chief Minister of West Bengal in the presence of around 3,200 guests that included Union Home Minister P Chidambaram, Finance Minister Pranab Mukherjee, outgoing chief minister Buddhadeb Bhattacharjee, Left Front chairman Biman Bose among others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X