పోటాపోటీ బంద్‌లతో అట్టుడుకుతున్న మహబూబ్ నగర్ జిల్లా

Mahaboob Nagar District
మహబూబ్‌నగర్: మంత్రులు జూపల్లి కృష్ణారావు, డికె అరుణ వర్గీయులు పోటాపోటీగా మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం బంద్‌లు చేపట్టారు. మంత్రి డికె అరుణ అరెస్టుకు నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా గద్వాల శాసనసభా నియోజకవర్గంలో బంద్ నిర్వహిస్తున్నారు. గద్వాల నియోజకవర్గంలో జూపల్లి కృష్ణా రావు పాదయాత్రను తన అనుచరులతో కలిసి అడ్డుకోవడానికి ప్రయత్నించిన అరుణను పోలీసులు గట్టు మండలం తుమ్మలపల్లి గ్రామంలో అరెస్టు చేశారు. దీనికి నిరసనగా యూత్ కాంగ్రెసు కార్యకర్తలు గద్వాల బంద్‌ను సాగిస్తున్నారు.

ఇదిలా వుంటే, జూపల్లి కృష్ణారావును పోలీసులు అరెస్టు చేసిన వెంటనే ఆయన అనుచరులు విధ్వంసానికి దిగారు. ఐయిజలో బంద్ పాటిస్తున్నారు. బస్సులకు నిప్పంటించారు. ఐయిజ చౌరస్తాలో జూపల్లి అనుచరులు ధర్నాకు దిగారు. ఐయిజలో బంద్ పాటిస్తున్నారు. దుకాణాలు, ఇతర సంస్థలను మూసేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేపట్టారు. ఆయన శనివారం గద్వాల శాసనసభా నియోజకవర్గంలోకి ప్రవేశించాల్సి ఉంది. తన నియోజకవర్గంలో జూపల్లిని అడ్డుకుంటానని డికె అరుణ అంతకు ముందే ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+