మంత్రుల్లో వైయస్ జగన్ కోవర్టులు లేరు: ముఖ్మయంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

తనకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, వైయస్ జగన్ సలహాలు అవసరం లేదని ఆయన అన్నారు. 14ఎఫ్ నిబంధనను సవరించాలని తాను చిదంబరాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తాను ప్రధానిని కోరినట్లు ఆయన చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరినట్లు ఆయన చెప్పారు. నిరుటి కన్నా 35 శాతం ధాన్యం దిగుబడి పెరిగిందని, దిగుబడి పెరగడం వల్లనే రైతులు సమస్యలు ఎదుర్కుంటున్నారని, దీంతో బియ్యం ఎగుమతికి అనుమతించాలని కోరానని ఆయన అన్నారు. రైతుల వరి ధాన్యం గిట్టుబాటు ధర 200 రూపాయలు పెంచాలని కోరినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications