ఎస్ఎస్‌సి ఫలితాల్లో బాలికలదే హవా, హైదరాబాద్ చివరి స్థానం

ఫలితాల్లో బాలురపై బాలికలు పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత 82.1 శాతం కాగా బాలికల ఉత్తీర్ణత శాతం 83.5 శాతం. 444 జడ్పీ పాఠశాలలు, 88 ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఈనెలాఖరుకల్లా మార్కుల మెమో అందిస్తామని మంత్రి వెల్లడించారు. జూన్ 18 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. రీకౌంటింగ్‌కు ఈనెల 23 నుంచి 15 రోజుల గడువు ఉందని తెలియజేశారు.
ఈ రోజు విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాల వారీ ఉత్తీర్ణతా శాతం ఈ విధంగా ఉంది.
కరీంనగర్ - 91.57
గుంటూరు - 91.32
నల్గొండ - 89.89
చిత్తూరు - 88.70
కడప - 87.62
పశ్చిమగోదావరి - 86.72
మహబూబ్‌నగర్ - 85.83
కృష్ణా - 85.68
మెదక్ -85.58
నిజామాబాద్ - 85.18
వరంగల్ - 84.38
ప్రకాశం - 83.27
తూర్పుగోదావరి - 82.21
ఆదిలాబాద్ - 81.51
విశాఖ - 81.07
ఖమ్మం - 80.83
విజయనగరం - 80.65
నెల్లూరు - 80.63
కర్నూలు - 78.99
శ్రీకాకుళం - 78.17
రంగారెడ్డి - 75.26
హైదరాబాద్ - 72.76












Click it and Unblock the Notifications