హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాస జిల్లా కలెక్టరేట్ల ముట్టడి, పలు చోట్ల ముందస్తు అరెస్టులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం తెలంగాణలోని జిల్లా కలెక్టర్ కార్యలయాల ముందు ధర్నాలు జరిగాయి. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెరాస కార్యకర్తలు ధర్నాకు దిగారు. కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌ కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

మెదక్‌జిల్లా ఎస్పీ వైఖరికి నిరసనగా హరీష్‌రావు నేతృత్వంలో తెరాస శ్రేణులు తొమ్మిదో నెంబర్‌ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. తెలంగాణాలోని అన్ని జిల్లా కలెక్టరేట్‌లను ముట్టడిస్తామని ముందుగా తెలియజేసి, అనుమతి కోరినప్పటికీ జిల్లా ఎస్పీ అనుమతి నిరాకరించడంతో పాటు, ముందస్తు అరెస్టులకు పాల్పడుతున్నారంటూ వారు ఆరోపించారు. ఎస్పీ వైఖరిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని వారు తెలియజేశారు. పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ తెరాస కార్యకర్తలు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించారు.

పలు జిల్లాల్లో పోలీసులు ముందస్తు అరెస్టులు జరిగాయి. ముందస్తు అరెస్టులపై తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు భగ్గుమన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా అని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. రంగా రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా ధర్నా జరిగింది.

English summary
TRS workers stage dharnas at district collectorates today. They demanded to propose Telangana bill in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X