వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు సైట్లలో పిచ్చి పిచ్చిగా అక్షరాలు కనపడడానికి కారణం ఇదేనా?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Font Problem
కొన్ని తెలుగు సైట్లు తెరిస్తే ఏవో పిచ్చి పిచ్చి గీతల్లాగా, ఏవో అర్థంలేని అక్షరాల్లాగా కనబడతాయి. అలాంటి సైట్లను సరిగ్గా చూడటానికి ఏం చేయాలో చూసి అవి ఎందుకు అలా కనబడతాయో కూడా తెలుసుకుందాం.

ఉదాహరణకి ఈనాడు సైటు తీసుకుందాం. ఈ సైటుని ఫైర్‌ఫాక్స్ లో తెరిచినట్లైతే, ఇదిగో ఆ పక్క బొమ్మలో చూపినట్టు కనబడుతుంది. ఈనాడు ఒక్కటే కాదు, తెలుగులో కొన్నేళ్ళ నుంచి ఉంటున్న చాలా సైట్లు అలాగే ఉన్నాయి. అయితే వీటిల్లో కొన్నింటిని ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ లో మాత్రం సరిగ్గానే చూడొచ్చు. అయినా అన్ని సైట్లకి కలిపి ఒక పరిష్కారం ఉంటే బావుంటుంది కదూ, అది కూడా మనకిష్టమైన ఫైర్‌ఫాక్స్‌లో ఉందండి అదే, పద్మ అనే ఫైర్‌ఫాక్స్ యాడ్ ఆన్. ఇక్కడికెళ్ళి Add to Firefox లేదా Install అని కొడితే ఆ యాడ్ ఆన్ ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఒక్కసారి ఫైర్‌ఫాక్స్‌ని క్లోజ్ చేసి మరలా ఓపెన్ చేస్తే మీ చింత తీరినట్లే. ఇకనుంచి మీరు ఏ తెలుగు సైటు కెళ్ళినా అందులో సమస్యేంటో తెలుసుకుని అదే సరిచేసేస్తుంది. ఏ చింతా లేకుండా తెలుగు సైట్లు చూసుకోవచ్చు.

ఇప్పుడు, ఒక సగటు మనిషికి అర్థమయ్యే మాటల్లో, అసలు ఆ సైట్లు ఎందుకు అలా ఉన్నాయో చూద్దాం. ఇదివరకు, అంటే ఒక 10-15 సంవత్సరాల క్రిందట, కంప్యూటర్లో తెలుగు భాషకి ఒక అధికారిక ప్రామాణికమంటూ ఒకటి లేదు. కానీ తెలుగువారికి కుడా అంతర్జాలంలో సైట్లు ఉన్నాయ్ కదా, అవి తెలుగులోనే ఉండాలి కాబట్టి, ప్రామాణికాలేవీ లేకపోయే సరికి ఎవరికి వారే ఒక ప్రామాణికం ఏర్పాటుచేసుకున్నారు. ఎలా అంటే, ఒకరు "A" అంటే "అ" అనుకుంటారు. ఇంకొకరు "A" అంటే "క" అనుకున్నారు. ఇలా అప్పటికి కంప్యూటర్లో ప్రామాణికాలున్న లాటిన్ అక్షరాలను తెలుగు అక్షరాలకు ఎవరిష్టంవచ్చినట్టు వాళ్ళు మ్యాప్ చేసేసుకున్నారు. అలా పుట్టినవే ఈనాడు ఫాంటు, వార్తా ఫాంటు వగైరా వగైరా. ఇలా ఒకటా రెండా, బోల్డన్ని ఫాంట్లు వచ్చేశాయ్.

కానీ ఇప్పుడు పరిస్థితి మారి యూనీకోడ్ అనే ఒక వ్యవస్థ పుట్టుకొచ్చింది. అది ప్రపంచభాషల్లో చాలావాటికి ప్రామాణికాలేర్పరిచింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే సైట్లు, బ్లాగులు, అన్నీ ఆ ప్రామాణికాన్నే వాడుతున్నారు. ఈ యూనీకోడ్ అన్ని కంప్యూటర్లలోనూ బాగానే కనిపిస్తుంది. ఒకవేళ కనిపించకపోతే ఇక్కడ చెప్పిన విధానాన్ని అనుసరించండి. కానీ 10-15 సంవత్సరాలుగా ఉన్న సైట్ల మాటేమిటి? అని మీరడగొచ్చు. అందుకే ఆ ఫాంట్లన్నిటినీ యూనీకోడ్ కి మార్చేలాగా ఒక ఉపకరణం తయారుచేయాలని సంకల్పించారు. ఇంకా ఎంతోమంది ఔత్సాహికులు ఆ ఉపకరణానికి తమతమ తోడ్పాటుని అందించారు. నేటికి పద్మ అన్ని భారతీయ భాషల్లోనూ కలిపి దాదాపు 80 ఫాంట్లను యూనీకోడ్ కి మార్చగల సామర్థ్యానికి ఎదిగింది.

English summary
If you are unable to read some Unicode characters in your browser, it may be because your system is not properly configured. Here are some basic instructions for doing that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X