వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారా లోకేష్ ఫ్లెక్సీలపై చంద్రబాబు సీరియస్, నేతలకు మందలింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: నారా లోకేష్ రాజకీయాల్లోకి రావాలంటూ ఫ్లెక్సీలు పెట్టిన నాయకులపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన చిత్తూరు జిల్లా నాయకుడు విజయ్‌బాబును ఆయన మందలించారు. మహానాడు వేదికపై నారా లోకేష్ ఫ్లెక్సీని పెట్టి తన ఫ్లెక్సీని పెట్టకపోవడంపై రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అసలేం జరుగుతోందంటూ ఆయన పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడితో అన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఫ్లెక్సీలు పెట్టడంపై చంద్రబాబు శనివారం మహానాడులో మండిపడినట్లు చెబుతున్నారు.

తన కుమారుడు నారా లోకేష్ రాజకీయాల్లోకి రావాలంటూ కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, అది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. వైయస్ జగన్ అవినీతిపై, కాంగ్రెసు ఫ్రభుత్వంపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. నారా లోకేష్ ఫ్లెక్సీలు పెట్టడం వంటి చర్యలను తాను సహించబోనని ఆయన హెచ్చరించారు. హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేయడం, జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు రాకపోవడం వంటి కారణాలతో చంద్రబాబు వెనక్కి తగ్గి దిద్దుబాటు చర్యలకు దిగినట్లు చెబుతున్నారు. నారా లోకేష్ రాజకీయాల్లోకి రావాలంటూ ఎటువంటి తీర్మానాలు చేయవద్దని ఆయన సూచించారు. ఒక వ్యక్తి గురించి ఇటువంటి చర్యలకు దిగవద్దని ఆయన చెప్పారు.

తీర్మానాలు చేయవద్దని తాను జిల్లా అధ్యక్షుడికి చెప్పానని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని ఆయన అన్నారు. అనవసరమైన వివాదాలకు కారణం కావద్దని ఆయన అన్నారు. ఈ మాటలతో చంద్రబాబు పార్టీలోని వారసత్వ పోరుకు తెర దించే ప్రయత్నం చేశారు.

English summary
TDP president N Chandrababu Naidu expressed anguish at Nara Lokesh flexis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X