హరికృష్ణ అసహనం ప్రదర్శించలేదు: యనమల రామకృష్ణుడు వివరణ
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: తమ పార్టీ నేత హరికృష్ణ మహానాడులో అసహనం ప్రదర్శించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. హరికృష్ణ అలిగినట్లు వచ్చిన వార్తలు వట్టి మాటలేనని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తనతో హరికృష్ణ వాగ్వాదానికి దిగలేదని ఆయన చెప్పారు. ఫ్లెక్సీల్లో తన ఫొటో లేదనే ప్రస్తావన హరికృష్ణ చేయలేదని ఆయన అన్నారు. మహానాడు ఏర్పాట్లపై, మహానాడులో కల్పించిన సౌకర్యాలపై మాత్రమే హరికృష్ణ తనతో మాట్లాడారని ఆయన అన్నారు.
మహానాడులో ప్రసంగించాలని కోరిన యనమల రామకృష్ణుడి వద్ద హరికృష్ణ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, హరికృష్ణ మహానాడులో ప్రసంగించకుండానే వెళ్లిపోయారు. మహానాడు వేదిక వెనక్కి వెళ్లి తనకు సన్నిహితులైన వల్లభనేని వంశీ, కొడాలి నాని, తదితరులతో హరికృష్ణ మాట్లాడారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. శుక్రవారం కూడా మధ్యలోనే హరికృష్ణ మహానాడు నుంచి వెళ్లిపోయారు.