హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిసిసికి కన్నా లక్ష్మినారాయణ, బొత్స సత్యనారాయణ మధ్యే పోటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్ష పదవికి మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, బొత్స సత్యనారాయణ మధ్యనే పోటీ నెలకొని ఉంది. బొత్స సత్యనారాయణను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కన్నా లక్ష్మినారాయణ పేరు తెర మీదికి వచ్చింది. కాగా, కన్నా లక్ష్మినారాయణను గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు వ్యతిరేకిస్తున్నారు. ఇద్దరు మంత్రులు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. సామాజిక వర్గాల మధ్య సమన్వయం సాధించే ఉద్దేశంతో కాపులకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణకు చెందిన ఎస్సీ దామోదరం నర్సింహను ఉప ముఖ్యమంత్రి పదవికి దాదాపుగా అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్‌ను శాసనసభ స్పీకర్‌గా నియమించాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా మల్లుభట్టి విక్రమార్క పేరు తెర మీదికి వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహిత మిత్రుడు. దీంతో ఈ పదవిపై కూడా అధిష్టానం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది.

అయితే, పిసిసి అధ్యక్షుడి ఎన్నికపైనే కాంగ్రెసు అధిష్టానం ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను దీటుగా ఎదుర్కోగల నాయకుడిని పిసిసి అధ్యక్షుడిగా నియమించాలని అధిష్టానం ఆలోచన చేస్తుంది. ఈ విషయంలో బొత్స సత్యనారాయణకే ఓటు పడే అవకాశం ఉంది. పైగా, బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకు చెందిన నాయకుడు కావడం కూడా అధిష్టానం ఆలోచనకు మరో కారణమని చెబుతున్నారు. జూన్ మొదటి వారంలో ఈ నియామకాలు పూర్తి కాగానే, తెలంగాణ అంశంపై దృష్టి పెట్టాలనే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు.

English summary
Competition for PCC president post is between two ministers Botsa Satyanarayana and Kanna Laxminarayana. CM Kiran Kumar Reddy is opposing Botsa Satyanarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X