పార్టీ సెంట్రల్ గవర్నెన్స్ సమావేశం, వైయస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు

సమావేశానికి ముందు ఆయన మాట్లాడుతూ పథకాలు కాంగ్రెసు పార్టీవి కావని కేవలం వైయస్ రాజశేఖరరెడ్డివే అన్నారు. కాంగ్రెసు పార్టీ పథకాలు అయితే జాతీయస్థాయిలో కాంగ్రెసు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎందుకు ప్రవేశ పెట్టలేదన్నారు. జగన్ వెంట వెళుతున్న కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వచ్చారు. మాజీ మంత్రులు బాలరాజు, పిల్లి సుభాష్ చంద్రబోసు, ఎమ్మెల్యేలు పి.రవి, ధర్మాన కృష్ణదాసు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, పిఆర్పీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు జగన్‌ను కలిసినవారిలో ఉన్నారు.