పార్లమెంటులో మేమే తెలంగాణ బిల్లు పెడతాం: బిజెపి నేత సుష్మా
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ మంగళవారం స్పష్టం చేశారు. కరీంనగర్‌లో బిజెపి నిర్వహిస్తున్న తెలంగాణ సభకు ఆమె హాజరయ్యేందుకు న్యూఢిల్లీ నుండి నేరుగా హైదరాబాదుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల మద్దతు బిజెపికి ఉందని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణపై పార్లమెంటులో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తాము తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
లోక్ పాల్ బిల్లు పరిధిలో ప్రధానమంత్రిని కూడా చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన సుష్మా స్వరాజ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కారులో లేక్ వ్యూ గెస్టు హవుజ్ చేరుకున్నారు.