మారన్ అవినీతిపరుడున్న తెహెల్కా: లీగల్ నోటీసులు పంపిన దయానిది
National
oi-Srinivas G
By Srinivas
|
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి దయానిధి మారన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. దయానిధి మారన్‌పై తెహెల్కా అవినీతి ఆరోపణలు చేసింది. గతంలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉన్నప్పుడు నాటి ప్రభుత్వంపై తెహెల్కా అవినీతి ఆరోపణలు చేసి ప్రముఖంగా అందరి నోళ్లలో నానింది. తాజాగా తెహెల్కా తమిళనాడుకు చెందిన డిఎంకె పార్టీ ప్రముఖ నేత దయానిధి మారన్‌పై అవినీతి ఆరోపణలు చేసింది. దీంతో ప్రతిపక్షాలు దయానిధి మారన్, ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. తెహెల్కా కథనానికి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అయితే తెహెల్కా పత్రిక కథనాన్ని మారన్ కొట్టి పారేశారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. మారన్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో భేటీ ఆయ్యారు. ఆయన తెహెల్కా పత్రికకు లీగల్ నోటీసులు ఇచ్చాడు. కాగా 2జి కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని తీహార్ జైలు పాలైన రాజాతో పాటు మారన్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Tehelka accused central minister Dayanidhi Maran in 2g spectrum scam. It revealed at story on him. He condemned Tehelka's comment and sent legal notice.
Story first published: Tuesday, May 31, 2011, 16:31 [IST]