హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తనతో ఎందరు శాసనసభ్యులు ఉన్నారో స్పష్టంగా పేర్కొంటూ వారి జాబితా విడుదల చేయాలని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. గవర్నర్ ముందు పరేడ్ చేయడానికి జగన్ గ్రూపు ఎందుకు భయపడుతుందని ఆయన ప్రశ్నించారు. భయం లేనప్పుడు జగన్‌తో కలిసి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వంపై అవిశ్వాసం తెలియజేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెసు ప్రభుత్వంపై అవిశ్వాసం టిడిపి సిద్ధంగా ఉందన్నారు.
రైతు సమస్యలపై వచ్చే సమావేశాల్లో అవిశ్వాసం పెట్టడానికి తాము సిద్ధమన్నారు. అయితే అవిశ్వాసంపై మిగతా పక్షాల వైఖరి స్పష్టంగా తెలియజేయాలన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై మా పార్టీ సలహాలు వద్దన్న వారు విభజనపై సత్వరమే నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదని కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి ప్రశ్నించారు.
Telugudesam party senior leader Yanamala Ramakrishnudu demanded ysr congress party president YS Jagan to released his MLAs names for support no confident vote.
Story first published: Tuesday, May 31, 2011, 17:10 [IST]