చంద్రబాబు అవిశ్వాసం పెడితే వైయస్ జగన్ ఎమ్మెల్యేల మద్దతు

వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలకు తూట్లు పొడుస్తున్న ప్రభుత్వంపై తాము పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. వైయస్ ఆశయాలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని, వైయస్ ప్రవేశ పెట్టిన పథకాలను అమలు చేయడం లేదని, పదవులు కాపాడుకోవడానికి మాత్రం వైయస్ పేరును వాడుకుంటున్నారని ఆయన అన్నారు. రేపటి నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ విధివిధానాలపై నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే వెల్లడించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. జులై 8వ తేదీన జరిగే ప్లీనరీ సమావేశం కోసం కమిటీలను వేసినట్లు ఆయన తెలిపారు. వైయస్ జగన్ జూన్ 3వ తేదీన జెరూసలేం వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.