మీడియా దుమారంతో పార్టీ సమావేశానికి హాజరైన అంబటి రాంబాబు

నిజానికి, అంబటి రాంబాబు వైయస్ జగన్‌పై అలిగినట్లు చెబుతున్నారు. తనను పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్‌లోకి తీసుకోకపోవడంపై మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. దాంతో కొద్ది రోజులుగా ఆయన జగన్‌కు దూరంగానే ఉంటూ వస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఓదార్పు యాత్రను పూర్తి చేసుకుని వచ్చిన వైయస్ జగన్‌ను అంబటి రాంబాబు కలవలేదు. ఇంతకు ముందు ఇలాంటి సందర్భాల్లో క్రమం తప్పకుండా అంబటి రాంబాబు జగన్‌ను కలిసేవారు. ఈసారి ఆ సంప్రదాయాన్ని దెబ్బ తీశారు. ఈ స్థితిలో అంబటి రాంబాబును వైయస్ జగన్ పట్టించుకోవడం కూడా మానేశారని అంటున్నారు. దీనివల్లనే బుధవారంనాటి సమావేశానికి అంబటి రాంబాబును ఆహ్వానించలేదని కూడా అంటున్నారు.












Click it and Unblock the Notifications