గవర్నర్‌కు జూపల్లి కృష్ణా రావు రాజీనామా లేఖ, ఆమోదించాలని వినతి

తన యాత్రను అడ్డుకోవడం ద్వారా పౌరుడిగా తనకు సంక్రమించిన రాజ్యాంగ హక్కుల్ని కాలరాసే ప్రయత్నం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. తాజా పరిణామం గురించి కిరణ్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు గులాం నబీ ఆజాద్‌కు తెలియజేశారు.సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన జూపల్లి గవర్నర్‌కు లేఖ ఇచ్చిన సంగతి గురించి తెలియజేశారు. తన నిర్ణయాన్ని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
జూన్ మొదటి లేదా రెండు వారాల్లోగా తెలంగాణపై నిర్ణయం రాకుంటే ఈ ప్రాంత మంత్రులు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని జూపల్లి కృష్ణా రావు అన్నారు వారంతా రాజీనామాలు చేస్తే తన పాదయాత్ర అవసరమే ఉండదన్నారు. 55 ఏళ్ల పోరాట ఫలితంగా వచ్చిన ప్రత్యేక రాష్ట్రాన్ని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రెండున్నర గంటల్లో అడ్డుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కొంతమంది ఇంటి దొంగలున్నారని, వారు ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్రవాదులతో చేతులు కలిపిన కొందరు తన పాదయాత్రను అడ్డుకున్నారని విమర్శించారు. ఇదంతా తెలంగాణ రాకుండా అడ్డుకునే ప్రయత్నమని ఆరోపించారు. వారిని నియంత్రించకపోగా తనను నిలువరించడం ఏమిటని జూపల్లి ప్రభుత్వంపై మండిపడ్డారు.












Click it and Unblock the Notifications