హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిదంబరం తెలంగాణ వ్యాఖ్యపై టిడిపి అధినేత చంద్రబాబు రుసరుసలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ సమస్యపై తనపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన వ్యాఖ్యపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రుసరుసలాడారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానని అంటున్నారు కదా, తీసుకోమనండి అని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. ఈ అంశంపై మళ్లీ అఖిలపక్ష సమావేశం పిలుస్తామని చిదంబరం ప్రకటించిన నేపథ్యంలో దానికి తెదేపా హాజరవుతుందా? అని ప్రశ్నించగా... ''అఖిలపక్ష సమావేశాలకు హాజరుకాకూడదని మేం గతంలోనే నిర్ణయించాం. మిగతా పార్టీలు కూడా అదే నిర్ణయం తీసుకున్నాయి. అయినా ఇప్పటికే కేంద్రప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం, ప్రజల అభిప్రాయం తీసుకుంది. అభిప్రాయాలు తీసుకునే ప్రక్రియ అయిపోయింది. ఇక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. ఆ పనిచేయకుండా మమ్మల్ని అడగడమేంటి?'' అని అన్నారు.

కాంగ్రెస్‌లో ఒకాయన ఉచిత సలహాలు వద్దంటారని, ఇంకో ఆయన ఇంకోటి అంటారని విమర్శించారు. ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీని విమర్శించిన తెరాస నేతల్లోనూ కొందరు కాంగ్రెస్‌దే నిర్ణయ బాధ్యత అంటున్నారని, గతంలో శాసనమండలి బిల్లు ప్రవేశపెట్టలేదా? అని అడుగుతున్నారన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారా? అన్న ప్రశ్నకు ఇక్కడున్న విలేకరులంతా ఏ నిర్ణయం అయినా సరే కట్టుబడి ఉంటారా? అని ప్రశ్నించారు. దీనిపై మళ్లీ ప్రశ్నించగా.. ''అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని చిదంబరం అన్నారని, అలాంటి నిర్ణయమే తీసుకోవాలి'' అని బదులిచ్చారు.

English summary
TDP president N Chandrababu Naidu made comment against Union Home minister P Chidambaram on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X