కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే రాజయ్య సంచలన ప్రకటన
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శానససభ్యుడు రాజయ్య శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం చర్చకు రావడానికి ముందే తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అనుకూల ప్రకటనకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే అవిశ్వాస తీర్మానంపై ఏం చేయాలనే విషయంపై ఈ నెల 5వ తేదీన జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన మీడియా ప్రతినిదులతో చెప్పారు.
పదవుల పంపకంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రాంత నాయకులకు అన్నీ డిప్యూటీ పదవులే ఇస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఓ ఆయుధంలా వాడుకోవాలని టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ అన్నారు. లేకుంటే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల దృష్టిలో తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని ఆయన శుక్రవారం ఇక్కడ వ్యాఖ్యానించారు.