కేబుల్ వ్యవస్థ జాతీయీకరణ: సన్ టివి ఆధిపత్యానికి జయ చెక్!
National
oi-Srinivas G
By Srinivas
|
చెన్నై: తమిళనాడులో సన్ టివి ఆధిపత్యానికి చెక్ చెప్పే విధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత పావులు కదిపింది. అంతేకాదు తమిళనాడులో గత కరుణానిధి ప్రభుత్వంలోని ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై కూడా ఆమె వరుసగా కొరడా ఝులిపిస్తున్నారు. తమిళనాడులోని కేబుల్ టీవి వ్యవస్థను ఆమె జాతీయీకరణ చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. దీంతో కొన్నేళ్లుగా ఆధిపత్యం చలాయిస్తున్న కరుణానిధి కుటుంబానికి చెందిన సన్ టివి షాక్ ఇచ్చినట్లయింది. ఇటీవల జరిగిన ఎన్నికలలో జయలలిత తాను గెలిస్తే కేబుల్ టీవి ప్రసారాని ఉచితంగా ప్రసారం చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఆమె ప్రజలకు ఇచ్చిన హామీ కూడా నెరవేరినట్లయింది.
డిఎంకె చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఆమె రద్దు చేసింది. అయితే త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ పథకం తీసుకు వస్తానని ప్రకటించింది. ఇక డిఎంకె హయాంలో నిర్మించిన కొత్త సచివాలయ భవనంలోని అవకతవకలపై విచారణ కమిషన్‌ను నియమించింది. మొత్తానికి జయ ముఖ్యమంత్రి అయిన తర్వాత డిఎంకె ప్రభుత్వంపై తన ప్రతీకారాన్ని తీర్చుకునే దిశల వెళుతున్నట్టుగా కనిపిస్తోంది.