చెడు స్నేహాలు చేస్తే కష్టాలు: కాంగ్రెసుపై కరుణానిధి పరోక్ష విమర్శలు
National
oi-Srinivas G
By Srinivas
|
చెన్నై: ఇటీవల తమిళనాడు ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన కరుణానిధి ఆ ఓటమికి కాంగ్రెసుపై పరోక్షంగా విరుచుకు పడ్డారు. చెడు స్నేహాలు చేస్తే కష్టాలు తప్పవని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కాంగ్రెసును ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. ఇటీవల పార్టీ ఓటమి నేపథ్యంలో తన 88వ పుట్టిన రోజును కరుణానిధి నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భాంగా ఆయన తమ ఓటమిని మిత్రపక్షాలపైకి నెట్టారు. మిత్రపక్షాల వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని అన్నారు. కనీసం తమకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తన పుట్టిన రోజును తన కుమార్తె కనిమొళి సమక్షంలో జరుపుకునేందుకు ఆయన తీహార్ జైలుకు వెళ్లనున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిఎంకె పథకాలను, కార్యక్రమాలపై కొరడా ఝులిపంచడమే కాకుండా కేబుల్ టీవి కార్యక్రమాలను జాతీయికరణ చేయడంపై మాజీ ఉపముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. తమపై ప్రతీకారేచ్ఛతోనే జయలలిత ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందని ఆరోపించారు. కొత్త సచివాలయ నిర్మాణ అవకతవకలపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. ఇలాంటి విచారణలు ఎన్నో చూశామని అన్నారు.