హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొణతాలకు సిఎం క్లాస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Konathala Ramakrishna
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొణతాల రామకృష్ణకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైయస్ జగన్ రాసిన వినతిపత్రం సమర్పించేందుకు కొణతాల రామకృష్ణ బుధవారం ముఖ్యమంత్రి కార్యలయానికి వచ్చినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. "గతంలో మీరూ మంత్రిగా పని చేశారుగా? అప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు లేవా? నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత.. 2008 నుంచి ఇప్పటివరకూ ఉన్న బకాయి రూ.1300 కోట్లను ఒక్కసారిగా చెల్లించాను. గత ఏడాది డిసెంబర్‌కు సంబంధించి దాదాపు రూ.650 కోట్లను కూడా రైతు సదస్సుల్లో చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశాం'' అని కొణతాల రామకృష్ణతో అన్నారు.

దానితో ఆగకుండా ''రైతులకు, మహిళలకు ఇస్తున్న వడ్డీ రాయితీ విషయంలోనూ ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసా? రుణం తీసుకున్న వారు ఒక్క రూపాయి బకాయి చెల్లించకపోయినా.. ప్రభుత్వం రూ.650 కోట్ల నిధులను విడుదల చేస్తోంది. దీన్ని బట్టి ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ప్రభుత్వం ఏమీ చేయలేదంటే ఎలా? మీరూ మంత్రిగా చేశారుగా!!'' అని ఆయన అన్నారు.

English summary
CM Kiran Kumar Reddy took class to YSR Congress party leader YS Jagan, when the later presented a memorandum on farmers issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X