హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందరి ఆమోదం అన్న చంద్రబాబు మాటలో అర్థమదేగా: నాగం ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మాటల్లో సమైక్యవాదం కనిపిస్తోందని ఆ పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి శుక్రవారం ధ్వజమెత్తారు. తెలంగాణపై అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు కేంద్రానికి సూచిస్తున్నారని అలా అంటే తెలంగాణకు వ్యతిరేకమనే విషయం తేటతెల్లమవుతుందని నాగం ఆరోపించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తెలంగాణకు కట్టుబడి ఉన్నారా లేదా నిర్ణయించుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం నాటకమాడుతుందని ఆరోపించారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు అందరూ కలిసి తెలంగాణపై అవిశ్వాసం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

సభాపతి, ఉప సభాపతి కాకుండా ముందు తెలంగాణ అంశం తేల్చాలని నాగం డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణకు చెందిన వారే ముఖ్యమంత్రితో సహా అన్ని పదవులలో కూర్చుంటారని ఆన్నారు. తమకు తెలంగాణ తప్ప మరేది ఆమోద యోగ్యం కాదని నాగం స్పష్టం చేశారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ ప్రభుత్వాలు అన్యాయం చేశాయని అన్నారు.

తెలంగాణ కాంగ్రెసు ప్రాంత శాసనసభ్యులకు అవిశ్వాసం పేరుతో మంచి అవకాశం వచ్చిందన్నారు. వారు అధిష్టానానికి వెంటనే ఆల్టిమేటం జారీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇస్తామని కేంద్రం నుండి హామీ వస్తే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసుకోవచ్చునని లేదంటే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి సదవకాశం రాదు కాబట్టి తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలు బాగా ఆలోచించాలన్నారు.

English summary
TDP suspended MLA Nagam Janardhan Reddy was fired at TDP chief Nara Chandrababu Naidu. He questioned Babu comments which statement given in Mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X