వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దిగిరాని బాబా రామ్‌దేవ్, రామ్‌లీలా మైదాన్‌లో దీక్ష ప్రారంభం

తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించడానికి రామ్‌దేవ్ శనివారం ఉదయం ఐదు గంటలకు వేదికపైకి వచ్చారు. తన వ్యాయామం, భక్తి గీతాల ద్వారా ప్రజలను ఉల్లాసపరిచే ప్రయత్నం చేశారు. పెద్ద యెత్తున తన దీక్షకు తరలివచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన పోరాటం నల్లధనానికి వ్యతిరేకమని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. వ్యక్తులపై వ్యాఖ్యలు చేయకూడదని ఆయన కోరారు.