అవిశ్వాసాన్ని ఎదుర్కుంటాం, మా బలం 164: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వస్తే తమ బలం మరింత పెరుగుతుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. కొందరు ఓటింగుకు రాలేదని ఆయన చెప్పారు. స్పీకర్ ఎన్నిక బ్యాలెట్ ద్వారా జరుగుతుందని చెప్పడంతో కొంత గందరగోళం ఏర్పడిందని ఆయన అన్నారు. పార్టీని వ్యతిరేకిస్తున్నవారిపై సమయం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానాన్ని సంప్రదించి మంత్రి వర్గ విస్తరణను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీ చేస్తామని ఆయన చెప్పారు.
ఏ పరీక్షకైనా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బలపరీక్షను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి శైలజానాథ్ చెప్పారు. ఏ పరీక్షలోనైనా నెగ్గే సత్తా తమకు ఉందని ఆయన చెప్పారు. స్పీకర్ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications