వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబా రామ్‌దేవ్ డిప్యూటీ అదృశ్యం, తలెత్తిన కొత్త వివాదం

ప్రతి రోజూ కొత్త డిమాండ్లను రామ్‌దేవ్ ముందుకు తెస్తున్నారని, తర్వాత లేవనెత్తిన అంశాలు తమకు పంపిన సమాచారంలో లేవని ప్రభుత్వం చెప్పింది. బాలకృష్ణ నేపాలీ నేరస్థుడని, ఇండియన్ పాస్‌పోర్టును అతను ఫోర్జ్ చేశాడని కాంగ్రెసు ఆరోపించింది. బాబా పక్కన కనిపించే బాలకృష్ణ నేపాల్ పౌరడని, అతను నేరస్థుడని, భారత దేశంలో తలదాచుకుంటున్నాడని, అతనికి పాస్‌పోర్టు ఎలా వచ్చిందో విచారణ జరపాల్సిన అవసరం ఉందని కాంగ్రెసు నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు.
రుజువులు లేకుండా బాలకృష్ణపై కొంత మంది బురద చల్లుతున్నారని, బాలకృష్ణ క్షేమంగా ఉన్నాడని, మిషన్ పనిలో బిజీగా ఉన్నాడని బాబా రామ్‌దేవ్ అన్నారు. తనను నాశనం పట్టించడంపై కేంద్రం ఎక్కువ దృష్టి పెడుతోందని ఆయన అన్నారు.