పిసిసి చీఫ్‌గా బొత్స సత్యనారాయణ, సోనియా, ఆజాద్‌లతో భేటీ

ఎందరు పోటీ పడినా చివరికి పిసిసి చీఫ్ పదవి బొత్స సత్యనారాయణను వరించింది. బొత్స సత్యనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడం, ఉత్తరాంధ్రకు చెందినవారు కావడం కలిసి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి బొత్స సత్యనారాయణకు మద్దతు తెలిపారు.తన పేరు పిసిసి చీఫ్ పదవికి ఖరారు కావడం వల్లనే బొత్స సత్యనారాయణ సోమవారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను కలిసినట్లు చెబుతున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల భర్తీ పూర్తి కావడంతో కాంగ్రెసు అధిష్టానం పిసిసి చీఫ్ పదవిపై, ప్రజారాజ్యం పార్టీ విలీనంపై దృష్టి పెట్టింది. బొత్స సత్యనారాయణ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications