రైల్వే శాఖపై కన్నేసిన చిరంజీవి, రాష్ట్ర మంత్రి పదవులపైనా పట్టు

Chiranjeevi
న్యూఢిల్లీ: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రైల్వే శాఖపై కన్నేసినట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉంటూ మంత్రి పదవికి రాజీనామా చేసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఈ నేపథ్యంలో తనకు రైల్వే శాఖ కావాలని చిరంజీవి కాంగ్రెసు అధిష్టానం వద్ద పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీన ప్రక్రియను పూర్తి చేయడానికి సంబంధించి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీతో చిరంజీవి విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన నాలుగు పదవులు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమైన శాఖలను కూడా ఆయన తన శాసనసభ్యులకు ఇప్పించుకునేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు.

రైల్వే శాఖను తృణమూల్ కాంగ్రెసుకే ఇవ్వాలని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించుకుంది. మమతా బెనర్జీ కూడా అదే కోరుతున్నారు. అందువల్ల రైల్వే శాఖ ఇవ్వడం కుదరనే పద్ధతిలో కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. అంతేకాకుండా కేంద్రంలో చిరంజీవి అతి ముఖ్యమైన శాఖను కేటాయించడానికి కూడా సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. తొలిసారి మంత్రి పదవి చేపడుతున్న చిరంజీవికి కీలకమైన శాఖ ఇస్తే ఇబ్బందులు ఎదురు కావచ్చునని అనుకుంటోంది. రాష్ట్రంలో కన్నబాబు వంటి ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెసులో అసంతృప్తి సెగలు రాజుకునే ప్రమాదం ఉందని కూడా అనుకుంటోంది.

చిరంజీవి ఈ స్థితిలో సోమవారం సాయంత్రం మరోసారి రాష్ట్ర కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో సమావేశమవుతున్నారు. మంత్రి పదవుల విషయంలో కాంగ్రెసు అధిష్టానం వద్ద పట్టు సడలించకూడదనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లోనే తగిన స్థానాలను సంపాదించుకుంటే అది కొనసాగుతుందని, మొదట్లోనే రాజీ పడితే అది నిరంతరం కొనసాగుతుందని చిరంజీవి భావిస్తున్నారు. ఏమైనా, కాంగ్రెసులో ప్రజారాజ్యం విలీన ప్రక్రియ పద్ద తతంగానే మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+