అలా చేస్తే మా ఎమ్మెల్యేలపై వేటు పడుతుంది: జగన్ వర్గం నేత గోనె
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్న కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు గవర్నర్ నరసింహన్ వద్దకు వెళ్లి పరేడ్ చేయాలని తెలుగుదేశం పార్టీ యువ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి చేసిన డిమాండ్‌పైవైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నేత గోనె ప్రకాశరావు ఖండించారు. రేవంత్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు పలక వద్దని సూచించారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు గవర్నర్ ముందు వెళ్లి పరేడ్ చేస్తే వారిపై వేటు పడుతుందని ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలు పరేడ్ చేసినా, అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసినా వారిపై వేటు పడుతుందని చెప్పారు. రేవంత్ రెడ్డి వారిపై వేటు పడాలనే ఉద్దేశ్యంలో భాగంగానే వారికి సవాల్ విసురుతున్నారని ఆరోపించారు.