తెలంగాణను మరో కడపలా మార్చవద్దు, రాష్ట్రం ఇవ్వాలి: కెకె

తాము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతామని ఆయన దీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామనే నమ్మకం తమకు ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ సాధించుకోవడమే తమ లక్ష్యం కాబట్టి అందుకు తగిన ప్రణాళికను రచిస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ సాధించుకోవాలనే పట్టుదల, పోరాట పటిమ తమ వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెసుకు కడపలో పట్టిన గతే తెలంగాణలో పడుతుందని ఆయన అన్నారు. పిసిసి చీఫ్ ఎవరైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తే మంచిదని ఆయన అన్నారు. ఈ నెల పదో తేదీన తెలంగాణ కోసం అధిష్టానాన్ని కలుస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications