విషం తాగి ప్రేమికుల ఆత్మహత్య: ప్రియుడికి అల్‌రెడీ ఇద్దరు పిల్లలు
Districts
oi-Srinivas G
By Srinivas
|
వరంగల్: జిల్లాలోని మహబూబాబాద్‌లో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ప్రియుడు ఆటో డ్రైవర్ కాగా, ప్రియురాలు స్రవంతి హోంగార్డుగా పని చేస్తుంది. వీరిద్దరు సోమవారం ఉదయం నగరంలోని జూనియర్ కళాశాల గ్రౌండ్స్‌లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని స్థానికి ఏరియా హాస్పిటల్ తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
కాగా ఆత్మహత్యకు పాల్పడిన ఆటో డ్రైవర్ అయిన ప్రియుడుకు గతంలోనే పెళ్లి అయింది. ఇతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా స్రవంతి, ఇతను ప్రేమించుకున్నారు. అయితే ఇప్పటికే ప్రియుడికి పెళ్లి అయినందున ఇటు స్రవంతి తల్లిదండ్రులు, అటు ప్రియుడి కుటుంబ సభ్యులు వీరి ప్రేమకు ఆమోదం తెలపలేదు. దీంతో మనస్థాపం చెందిన వారు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.