మీడియా తెలంగాణపై స్వారీ చేసింది, చరిత్రను వక్రీకరించారు: కెసిఆర్
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: ఇప్పటి వరకు మీడియా తెలంగాణపై స్వారీ చేసిందని, తమ నమస్తే తెలంగాణ పత్రిక ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. తెలంగాణ చరిత్రను రాయకపోవడమో, వక్రీకరించడమో చేశారని ఆయన అన్నారు. నమస్తే తెలంగాణ దినపత్రిక ఆవిష్కరణ సభలో ఆయన సోమవారం మాట్లాడారు. తమ పత్రికను అపడానికి పలు కుట్రలు జరిగాయని, వాటిని సభాముఖంగా చెప్పడం సరి కాదని ఆయన అన్నారు. ప్రస్తుత తెలంగాణను, భవిష్యత్తు తెలంగాణను పత్రిక ఆవిష్కరిస్తుందని ఆయన అన్నారు.
తాము కేవలం భౌగోళిక తెలంగాణ కోసమే కాదు, భవిష్యత్తు తెలంగాణ నిర్మాణానికి కూడా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దోపిడీకి, వివక్షకు, అణచివేతలకు గురవుతున్న పక్షాన పత్రిక నిలుస్తుందని ఆయన అన్నారు. ప్రజల పత్రికగా దీన్ని నిలబెట్టాలని ఆయన సూచించారు. నమస్తే తెలంగాణ పత్రిక తెలంగాణలో నెంబర్ వన్ పత్రిక అవుతుందని ఆయన అన్నారు. ఉర్దూ దినపత్రికను కూడా తాము రంజాన్‌కల్లా తెస్తామని ఆయన అన్నారు.