మాదాపూర్‌లో సెజ్ ఏర్పాటుకి మరింత సమయం కోరిన మహీంద్రా సత్యం

చివరి గడువు తేదీ జూన్ 19తో ముగుస్తుంది. కాగా, విశాఖపట్నం తోట్లకొండ హిల్స్ వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన ఐటీ, ఐటీఈఎస్ సెజ్‌ను డీనోటిఫై చేయాలన్న మహీంద్రా సత్యం ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం బీవోఏకు పంపించింది.
ఈ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం నావికాదళానికి బదలాయించిందని, ఇక్కడ వైర్‌లెస్ ఎక్స్‌పెరిమెంటల్ యూనిట్ ఏర్పాటు కానుందని, దీంతో సెజ్ డీనోటిఫై చేయాలని మహీంద్రా సత్యం కోరింది. సెజ్ ఏర్పాటుకై సత్యంకు మరోచోట 50 ఎకరాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications