బొత్స సత్యనారాయణ ఎంపికతో జగన్ స్పీడ్‌కు చెక్: పితాని

Pitani Satyanarayana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పీడ్‌కు చెక్ పెట్టేందుకే అధిష్టానం బొత్స సత్యనారాయణను ఎంపిక చేసిందని మంత్రి పితాని సత్యనారాయణ వేరుగా అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ ఆయన కూడా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మంత్రి శైలజానాథ్ మంగళవారం అన్నారు. బొత్స పిసిసి అధ్యక్షుడిగా కాక ముందు తన అభిప్రాయాన్ని వెల్లడించారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అధిష్టానం బొత్స సత్యనారాయణను ఎంపిక చేసిందని అన్నారు. మాదిగ రిజర్వేషన్‌లకు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవికి ముడి పెట్ట కూడదని ఆయన అన్నారు. మాదిగ రిజర్వేషన్‌లు కాంగ్రెసు పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. బొత్స సత్యనారాయణ ఎంపికను ప్రాంతాలు, కులాల వారీగా చూడవద్దని కోరిక.

కాగా కడప జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రి తాత్కాలిక వైద్యులు తమకు జీతాలు సరిగా అందడం లేదని ఆందోళన చేశారు. వారి సమస్యను అడిగి తెలుసుకోవడానికి మంత్రి అహ్మదుల్లా రిమ్స్‌కు వెళ్లారు. తాత్కాలిక ఉద్యోగులు అహ్మదుల్లాని నిలదీశారు. వారి ఆందోళనకు స్పందించిన అహ్మదుల్లా జీతాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+