బస్సు ప్రమాదంలో 23 మంది మృతి, తమిళనాడులో ఘోరం

Vellore Road Mishap
వేలూరు: చెన్నై-బెంగుళూరు జాతీయ రహదారిలోని కావేరిపాక్కం వద్ద మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. చెన్నై నుంచి పొల్లాచ్చి వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురికావడంతో ఇందులో 23 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. డ్రైవర్‌తో సహా ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. చెన్నై నుంచి 25 మంది ప్రయాణికులతో బయలుదేరిన కేపీఎన్‌ ట్రావెల్స్‌ లగ్జరీ బస్సు రాత్రి 11 గంటల సమయంలో అవలూరు వద్ద వెళ్తుండగా ఎదురుగా వెళ్తున్న లారీను ఓవర్‌ టేక్‌ చేసేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో లారీ రోడ్డుకు ఎడమవైపునకు రావడంతో దానిని ఢీకొట్టకుండా ఉండేందుకు బస్సుని డ్రైవరు పక్కకు తిప్పాడు. ఈ అకస్మాత్తు పరిణామంతో రోడ్డు వెంబడి ఉన్న చిన్నపాటి వంతెన రక్షణ గోడను ఢీకొట్టి వంతెనపై నుంచి కిందకు బోల్తా కొట్టింది. ఆ సమయంలో ఒక్కసారిగా బస్సు నుంచి మంటలు వ్యాపించాయి. అందులోని ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

ప్రమాద స్థలికి ప్రధాన ప్రాంతాలు దూరంగా ఉండటంతో అగ్నిమాపక దళ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకోవడానికి ఆసల్యమైంది. బస్సు బోల్తాపడిన స్థలం ముళ్ల పొదలతో కూడిన పెద్ద గుంతగా ఉండటంతో అందులో నుంచి మృతులను బయటకు తీసేందుకు సమయం పట్టింది. ఒంటి గంట సమయంలో జిల్లా కలెక్టరు నాగరాజన్‌ తదితర జిల్లా ఉన్నతాధికారులు ప్రమాద స్థలికి చేరుకొన్నారు. అప్పటి వరకు ఇంకా బస్సు నుంచి మృతదేహాలను వెలికి తీయలేదు. ప్రమాదం కారణంగా చెన్నై-బెంగుళూరు జాతీయ రహదారిలో ప్రమాద స్థలి నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరం వరకు ఇరు వైపులా రాకపోకలు స్తంభించాయి. డ్రైవర్‌ నాగరాజన్‌, మరో ప్రయాణికుడు చెన్నైకి చెందిన రాజా ప్రాణాలతో బయటపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+