చిరంజీవితో బొత్స సత్యనారాయణ భేటీ, క్యూ కట్టిన మంత్రులు

బొత్స సత్యనారాయణ భేటీ సందర్భంగా చిరంజీవి నివాసానికి రాష్ట్ర మంత్రులు క్యూ కట్టారు. వీరు క్యూ కట్టడాన్ని బట్టే వారిరువురి మధ్య భేటీకి గల ప్రాధాన్యత తెలుస్తోందని అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ ముఖ్య నేతలు, శాసనసభ్యులు కూడా అక్కడికి వచ్చారు. మంత్రులు పితాని సత్యనారాయణ, విశ్వరూప్, పొన్నాల లక్ష్మయ్య, మహీధర్ రెడ్డి, శ్రీధర్ బాబు, సారయ్య, ఆనం రామనారాయణ రెడ్డి చిరంజీవి నివాసానికి వచ్చారు.
కాగా, పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణను నియమించాలని చిరంజీవి కాంగ్రెసు అధిష్టానానికి సూచించినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించినప్పటికీ చిరంజీవి సూచన మేరకు బొత్స సత్యనారాయణను కాంగ్రెసు అధిష్టానం పిసిసి అధ్యక్షుడిగా నియమించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications