అవిశ్వాసంపై టిడిపి వెనక్కి తగ్గితే నోటీసు మేమిస్తాం: నారాయణ

కాగా తమకు కొత్త మిత్రులను వెతుక్కోవాల్సిన అవసరం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు వేరుగా వ్యాఖ్యానించారు. మాకోసం వారే వెతుక్కోవాలని అన్నారు. కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ప్రకటన బాధ్యతా రాహిత్యంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర పరిస్థితిని మార్చలేరన్నారు. ముంచినా తేల్చినా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లే అన్నారు.