ఎంసెట్ ఫలితాలు విడుదల, హిమజ మెడిసిన్ టాపర్

ఎస్‌ఎంఎస్ ద్వారా విద్యార్థులకు మార్కుల వివరాలు పంపుతారు. రీకౌంటింగ్, రీ వాల్యుయేషన్‌కు ఈనెల 12 వరకు గడువు వుంది. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల తర్వాతే ర్యాంకులు ప్రకటిస్తారు. జులై మొదటి వారంలో ర్యాంకులు విడుదల చేసే అవకాశం ఉంది. మూడోవారంలో వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఆగస్టు మొదటివారంలో తరగతులు ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు.
మెడిసిన్ విభాగంలో 85.15 శాతం మంది క్వాలిఫై అయ్యారు. 65,736 విద్యార్థులు పరీక్ష రాయగా 55,995 మంది క్వాలిఫై అయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 82.5 శాతం మంది అర్హత సాధించారు. 2,69,986 మంది పరీక్ష రాయగా, 2,22,857 మంది క్వాలిఫై అయ్యారు.
మెడిసిన్ విభాగంలో వరుసగా మొదటి ఐదు ర్యాంకులు హిమజ, ఉమా మహేశ్వరి, స్నేహిత, ఫహిత, కామిని సాధించగా, ఇంజనీరింగ్ విభాగంలో వరుసగా మొదటి ఐదు ర్యాంకులు నల్లా ప్రత్యూష్, నాగం ప్రశాంత్, శశాంక్, అవినాష్, యశ్వంత్ సాధించారు. ఈ ఫలితాల్లోనూ కార్పొరేట్ కాలేజీలదే పైచేయిగా ఉంది.












Click it and Unblock the Notifications