ఏ ప్రభుత్వం చేయని మేలు మేం రైతులకు చేశాం: సిఎం కిరణ్ కుమార్

జలయజ్ఞం ద్వారా ఇప్పటివరకు 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని వచ్చే మూడేళ్లలో 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందుకు 30వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. శ్రీకాకుళంలో బుధవారం ఆయన రైతు సదస్సులో పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు శ్రీకాకుళంలో కిమ్స్ సాయిశేషాద్రి ఆసుపత్రిని ప్రారంభించిన ఆయన అనంతరం జిల్లా మంత్రులు, అధికారులతో సమీక్షలు జరిపారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలకు అభ్యంతరం చెబుతూ శ్రీకాకుళంలో బుధవారం ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి చేపట్టిన సదస్సులో రైతులు ఆందోళన చేపట్టారు. గతంలో ప్రవేశపెట్టిన పథకాలన్ని వైఎస్‌ఆర్ పథకాలు కావని ధర్మాన వ్యాఖ్యానించడంతో రైతులు ఒక్కసారిగా మండిపడ్డారు.