మహబూబ్‌నగర్: తెలంగాణలో శ్రీకృష్ణ కమిటీ రహస్యంగా అందించిన 8వ చాప్టర్‌ను అమలు పరచడానికే కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీని కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగిందని తెలుగుదేశం పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి బుధవారం విమర్శించారు. తెలంగాణపై కాంగ్రెసు నేతలు స్పష్టమైన ప్రకటనతో రాష్ట్రం తిరిగి రావాలని ఆయన అన్నారు. లేకుంటే శంషాబాద్ విమానాశ్రయంలోనే వారిని అడ్డుకుంటామని అన్నారు. రాష్ట్రం 610 జివోలోని 14 ఎఫ్‌ను తొలగిస్తే వెంటనే సీమాంధ్రలో జై ఆంధ్ర ఉద్యమం పుట్టుకు వస్తుందని ఆయన అన్నారు. కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌కు కమిటీ రిపోర్టుపై అవగాహన లేదన్నారు. కాంగ్రెసు నేతలు ఇప్పుడు బానిసలుగా బతుకుతూ తెలంగాణ ప్రజలను బానిసలుగా చేసినట్లేనని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యానికి కారణం ఏంటో చెప్పాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులను బలిగొన్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీయే మా మొదటి లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలకతీతంగా తెలంగాణ ఎజెండాపై పాల్గొనాలన్నారు. అలా చేస్తేనే కేంద్రానికి వణుకు పుడుతుందన్నారు. తెలంగాణకు అనుకూలమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ ఇస్తే కాంగ్రెసును చెడుగుడు ఆడి రాష్ట్రాన్ని సాధిస్తామని స్పష్టం చేశారు.
TDP suspended MLA Nagam Janardhan Reddy said today that he will fight against congress for Telangana if TDP president Chandrababu Naidu give letter to centre.
Story first published: Wednesday, June 8, 2011, 15:05 [IST]