బహ్రెయిన్‌లో రోడ్డున పడిన తెలుగు కార్మికులు, తిండి లేక ఇబ్బందులు

2003, 2006 సంవత్సరాల మధ్య కాలంలో వివిధ భవన నిర్మాణ సంస్థలు ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 2 వేల మంది కార్మికులను బహ్రెయిన్ తీసుకుని వెళ్లాయి. అయితే, కంపెనీలు వారికి సరైన సదుపాయాలు కల్పించలేదు. దాంతో వారు ఆ సంస్థల నుంచి బయటకు వచ్చారు. అయితే, వారిపై కంపెనీలు కోర్టుకు వెళ్లాయి. కార్మికులు దేశం విడిచి వెళ్లకుండా బహ్రెయిన్ కోర్టు తీర్పు చెప్పింది. ఒకవేళ తిరిగి వెళ్లిపోవాలనుకుంటే భారీ మూల్యం చెల్లించాలని షరతు పెట్టింది. దీంతో వారు ఆ మొత్తాన్ని చెల్లించలేక వీధులపైనే కాలం వెళ్లదీస్తున్నారు.












Click it and Unblock the Notifications