వైయస్ జగన్ వల్ల ఎలాంటి సమస్య లేదు: బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్ల గానీ, ఆయన పార్టీ వల్ల గానీ కాంగ్రెసు పార్టీకి ఎలాంటి సమస్య లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గురువారం విలేకరుల సమావేశంలో చెప్పారు. త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే బిసి గణన కారణంగా ఎన్నికలు వాయిదా పడితే పడవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కాగా తమకు మావోయిస్టుల నుండి ముప్పు ఉన్నదని తెలుపుతూ ఇంటెలిజన్స్ వర్గాల నుండి లేఖ వచ్చిందని అయితే వారు తనకు లేఖ పంపి చేతులు దులుపుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.

స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అనం రాంనారాయణరెడ్డి తెలిపారు. గతంలో నిర్వహించిన విధంగానే స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స జోడు పదవుల విషయం అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+