తొలిసారే మంత్రులకు ప్రధాని షాక్: ఇద్దరు ఎంపీలకే అపాయింట్‌మెంట్

అయితే ప్రధానిని కలవడానికి పార్లమెంటు సభ్యులకు ఇద్దరికి మాత్రమే అపాయింట్‌మెంట్ దొరికింది. మంత్రులకు దొరకలేదు. అయితే మంత్రులకు అపాయింట్‌మెంట్ దొరకనందున వారు ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానిని కలిసే అవకాశం లేనప్పుడు అక్కడికి వెళ్లి ఏం చేద్దామనే యోచనలో మంత్రులు పడినట్లు తెలుస్తోంది. దీంతో పలువురు మంత్రులు తమ టిక్కెట్లను కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రధాని అపాయింట్‌మెంట్ ఇద్దరికే దొరికినందున ఎంపీలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పెద్దపెల్లి ఎంపీ వివేక్ ప్రధానిని కలవడానికి వెళ్లారు. అయితే మిగిలిన ఎంపీలకు అపాయింటుమెంటు దొరకనప్పటికీ వారు కూడా రాజగోపాల్, వివేక్‌తో కలిసి బయలు దేరి వెళ్లారు. ప్రధాని అక్కడకు వెళ్లిన తర్వాత తమకు కలవడానికి అవకాశం ఇస్తారనే ఆశాభావంతో వారు ఉన్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications