సీమాంధ్రులకు కీలక పదవులు, తెలంగాణవారికి అన్యాయం: శంకరరావు

మంత్రివర్గంలో తెలంగాణ వారికి మంచి శాఖలు కేటాయించాలని మంత్రి శంకర్‌రావు కోరారు. బడుగు వర్గాలకు చెందిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్ఠానానికి సూచించారు. ముఖ్యమంత్రి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారైతే స్పీకర్, పీసీసీ అధ్యక్ష పదవులు తెలంగాణ వారికి ఇచ్చే వారని, అయితే ఆ సాంప్రదాయానికి విరుద్దంగా పార్టీ వ్యవహరిస్తోందన్నారు. ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పలువురు తెలంగాణ మేధావులు రాష్ట్రపతికి, గవర్నర్‌కు, సోనియాకు లేఖలు రాస్తున్నారని చెప్పారు. అధిష్ఠానానికి ముడుపులు అందాయంటూ ఆమోస్, యాదవరెడ్డి చేసిన ఆరోపణలను శంకర్‌రావు ఖండించారు. ముడుపులు తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెసు అధిష్టానానికి లేదని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయం తనకు తెలియదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications