ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తా, పార్టీలో అందరూ సమానమే: బాలకృష్ణ
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని సినీ హీరో, తెలుగుదేశం నాయకుడు బాలకృష్ణ చెప్పారు. ప్రజలు కోరుకున్నప్పుడు తాను తప్పకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఆయన అన్నారు. బసవతారకం ఆస్పత్రిలో ఆయన శుక్రవారం తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. కేక్ కట్, రోగులకు పండ్లు పంపణీ చేశారు. తనకు సినిమాలు, రాజకీయాలు రెండు కళ్లు అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీలో నందమూరి కుటుంబానికి ప్రాధాన్యం తగ్గిందనే వాదనతో ఆయన ఏకీభవించలేదు.
తెలుగుదేశం పార్టీలో నందమూరి కుటుంబానికి ప్రాధాన్యం తగ్గలేదని, వ్యవస్థలాంటి పార్టీలో అందరూ సమానమేనని ఆయన అన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, పార్టీకి సేవలు అందిస్తానని ఆయన అన్నారు. అంతకు ముందు ఆయన ఐటెక్స్‌లో హరహర మహదేవ షూటింగులో పాల్గొన్నారు. ఈ షూటింగ్ ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన అభిమానులు కాబోయే సిఎం బాలకృష్ణ అంటూ నినాదాలు చేశారు.