నేను పాలు, కూరగాయలే అమ్ముకుంటున్నా: జగన్‌పై బాబు విమర్శ
Districts
oi-Srinivas G
By Srinivas
|
చిత్తూరు: తాను కేవలం పాలు, కూరగాయలు మాత్రమే అమ్ముతున్నానని కానీ ప్రజలను వంచించి గనులను మాత్రం కొల్లగొట్ట లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. శుక్రవారం ఆయన చిత్తూరు జిల్లాలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తాను కేవలం వ్యాపారాలు మాత్రమే చేస్తున్నానని అధికారాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించలేదన్నారు. అధికారం అండగా కోట్లు సంపాదించిన జగన్‌కు కూడా 2జి స్పెక్ట్రంలో రాజాకు పట్టిన గతే పడుతుందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై మహానాడులో మా వైఖరి స్పష్టం చేశామని ఆయన అన్నారు. మరో ఆరు నెలల్లో టిడిపి తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు.
అందుకు చిత్తురూ జిల్లా నుండే శ్రీకారం చుడతానని చెప్పారు. తాను ఎప్పుడూ వ్యవసాయం దండుగ అనలేదన్నారు. 15, 16 తేదీల్లో రాష్ట్ర పార్టీ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. నాపై కాంగ్రెసు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని స్పష్టం చేశారు. కిరణ్ దద్దమ్మ అన్నారు. రైతుల సమస్యలను తీర్చడానికి త్వరలో ఓ కమిటీని వేస్తామని చెప్పారు.
TDP chief Chandrababu Naidu blames YSR congress party president YS Jaganmohan Reddy that he has only milk and vegetables business but not occupied mines.
Story first published: Friday, June 10, 2011, 16:53 [IST]